IPL 2025: మరికొద్ది సేపట్లో KKR vs RCB మ్యాచ్.. స్టేడియాన్ని కమ్మేసిన నల్లని మేఘాలు

ఐపీఎల్ 2025 సీజన్ మరికొద్ది సేపట్లో కోల్‌కత్తా వేదికగా ప్రారంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ మెగా టోర్నీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణంలో.. వాతావరణం వారందరికీ షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది.

Update: 2025-03-22 09:27 GMT
IPL 2025: మరికొద్ది సేపట్లో KKR vs RCB మ్యాచ్.. స్టేడియాన్ని కమ్మేసిన నల్లని మేఘాలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ (IPL) 2025 సీజన్ మరికొద్ది సేపట్లో కోల్‌కత్తా (Kolkata) వేదికగా ప్రారంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ మెగా టోర్నీ (Mega tournament) కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణంలో.. వాతావరణం వారందరికీ షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. నిన్నటి నుంచి కోల్‌కత్త ప్రాంతంలో దట్టమైన మేఘాలు (Thick clouds) కమ్ముకుని ఉన్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా చల్లని వాతావరణం (చల్లని వాతావరణం)తో పాటు నల్లని మేఘాలు స్టేడియం చుట్టూ కమ్ముకున్నాయి. అయితే మ్యాచ్ ప్రారంభం (Start of the match) అయ్యే సమయానికి భారీ వర్షం పడే అవకాశం (Chance of heavy rain) ఉన్నట్లు స్థానిక వాతావరణ కేంద్రం అలర్ట్ (Weather Center Alert) జారీ చేసింది. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కొలకత్త వాతావరణ పరిస్థితి పై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. రాత్రి వర్షం కురుస్తుందా లేదా అని గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు.

అయితే స్థానికంగా ఉన్న కొంతమంది ప్రస్తుత పరిస్థితులపై వీడియోలను విడుదల చేస్తున్నారు. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిన్న రాత్రి మోస్తారు వర్షం కురవగా ఈ రోజు మధ్యాహ్నం సమయానికి గ్రౌండ్ సమీపం మొత్తం దట్టమైన మేఘాలు (Thick clouds) అలుముకోవడంతో.. స్టేడియంలో చీకట్లో కమ్ముకోవడం ఆ వీడియోలో కనిపించింది. పరిస్థితి ఇలానే కొనసాగితే మరికొద్ది గంటల్లో ప్రారంభం కావాల్సిన ఓపెనింగ్ సెర్మనీ (Opening Ceremony) కూడా జరగకపోవచ్చు అని చర్చించుకుంటున్నారు. వాతావరణ శాఖ మాత్రం సాయంత్రం లోపు మోస్తరు వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు తెలుపుతుంది. మరీ మొదటి మ్యాచ్ జరుగుతుందా.. లేక వర్షార్పణం అవుతుందా తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ఈ రోజు జరిగే మొదటి మ్యాచుల్ ఢిపెండింగ్ ఛాంపియన్ కేకేఆర్, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు.


Similar News