Joe Root:మరో అరుదైన రికార్డు సాధించిన జో రూట్.. ఏంటా రికార్డు..?

ఇంగ్లాండ్(England) స్టార్ బ్యాటర్ జో రూట్(Joe Root) మరో అరుదైన ఘనత సాధించాడు.

Update: 2024-09-09 23:54 GMT

దిశ, వెబ్‌డెస్క్:ఇంగ్లాండ్(England) స్టార్ బ్యాటర్ జో రూట్(Joe Root) మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు బాదిన ఆరో బ్యాటర్​గా రికార్డ్ సృష్టించిన రూట్ తాజాగా టెస్టుల్లో అత్యధిక ప్లేయర్ అఫ్ ద సిరీస్(POTS) అందుకున్న తొమ్మిదో క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు.ఇప్పటివరకు ఆయన టెస్ట్ కెరీర్ లో 6 POTS అవార్డులు అందుకున్నాడు.అలాగే ఇంగ్లాండ్ తరుపున అత్యధిక ప్లేయర్ అఫ్ ద సిరీస్ అవార్డులు అందుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో అతను గ్రాహం గూచ్(Graham Gooch), ఆండ్రూ స్ట్రాస్(Andrew Strauss) , జేమ్స్ అండర్సన్(James Anderson) లను అధిగమించాడు.

ఇదిలా ఉంటే రూట్ తన టెస్ట్ కెరీర్ లో ఇప్పటివరకు 12,402 పరుగులు చేశాడు.అందులో 34 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.కాగా రూట్ కొంతకాలంగా టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ లో అదరగొడుతున్నాడు. తనదైన ట్రేడ్ మార్క్ స్టైల్ చూపిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. రీసెంట్ గా శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్​లో అత్యధిక సెంచరీలు బాదిన ఇంగ్లాండ్ క్రికెటర్​గా కుక్(Cook) 33 ను అధిగమించి టాప్​లో నిలిచాడు. అలాగే ఈ సిరీస్​లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్​గా మొదటి స్థానంలో నిలిచాడు. రూట్ శ్రీలంక తో జరిగిన టెస్ట్ సిరీస్ లో 75 సగటుతో మొత్తంగా 375 పరుగులు చేశాడు. ఇందులో 2 శతకాలు ఉన్నాయి.


Similar News