India vs Bangladesh : ముగిసిన తొలిరోజు ఆట.సెంచరీతో సత్తా చాటిన అశ్విన్

చెన్నైలోని చెపాక్ మైదానం(chepauk stadium) వేదికగా బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరుగుతోన్న తొలి టెస్ట్‌(Test)లో టీమిండియా(Team India) ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) అదరగొట్టాడు.

Update: 2024-09-19 11:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: చెన్నైలోని చెపాక్ మైదానం(chepauk stadium) వేదికగా బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరుగుతోన్న తొలి టెస్ట్‌(Test)లో టీమిండియా(Team India) ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) అదరగొట్టాడు. స్టార్ బ్యాటర్లు అంతా చేతులెత్తేసిన క్లిష్ట సమయంలో సెంచరీతో సత్తా చాటాడు. కేవలం 108 బంతుల్లోనే 100 పరుగులు సాధించాడు. ఇందులో పది ఫోర్లు, రెండు సిక్సులు ఉన్నాయి.

కాగా, తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లు నిరాశపరిచారు. జైశ్వాల్(56) నిలకడగా రాణించి.. హాఫ్ సెంచరీ చేయగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(06), విరాట్ కోహ్లీ(06), శుభ్‌మన్‌ గిల్(00), కేఎల్ రాహుల్(16) విఫలం అయ్యారు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్(39)తో రాణించారు. ఇటువంటి క్లిష్ట సమయంలో అశ్విన్, జడేజా బాధ్యతలు మీదేసుకున్నారు. మొత్తంగా ఆరు వికెట్ల నష్టానికి 80 ఓవర్లలో టీమిండియా 339 పరుగులు చేసింది. కాగా, చెన్నైలోని చెపాక్ మైదానం అశ్విన్‌కు హోం గ్రౌండ్ కావడం విశేషం. టెస్టుల్లో ఇది అశ్విన్‌కు ఆరో సెంచరీ కాగా, హోంగ్రౌండ్‌లో ఇది రెండోది కావడం గమనార్హం.

Tags:    

Similar News