13 ఏళ్ల కుర్రాడి కోసం పోటీపడిన ఫ్రాంచైజీలు.. రాజస్థాన్ అంత పెట్టి కొనిందా?
బిహార్‌కు చెందిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి భారీ ధర పలికింది.
దిశ, స్పోర్ట్స్ : ఆసక్తికరంగా సాగుతున్న ఐపీఎల్ ఆక్షన్‌లోకి ఓ కుర్రాడు వేలంలోకి వచ్చాడు. ఆ కుర్రాడి వయసు 13 ఏళ్లే. ఆ యువ క్రికెటర్‌ను దక్కించుకోవడానికి ఫ్రాంచైజీలు పోటీపడటం విశేషం. ఆ కుర్రాడు ఎవరో తెలుసా.. బిహార్‌కు చెందిన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతనిపై కనకవర్షం కురిసింది. సూర్యవంశీని రాజస్థాన్ ఏకంగా రూ. 1.10 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ వేలంలో చరిత్రలోనే కొనుగోలు చేసిన యంగెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు. అలాగే, 13 ఏళ్లకే అతను ఐపీఎల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన టెస్టు సిరీస్‌లో సూర్యవంశీ అందరి దృష్టిని ఆకర్షించాడు. తొలి రెడ్ బాల్ మ్యాచ్‌లోనే 58 బంతుల్లో శతకం నమోదు చేసిన అతను భారత అండర్-19 టెస్టుల్లో ఫాసెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు.