BGT 2024 : ఆస్ట్రేలియాకు గంగూలీ స్ట్రాంగ్ వార్నింగ్

ఆస్ట్రేలియా జట్టుకు టీంఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ వార్నింగ్ ఇచ్చాడు.

Update: 2024-11-25 15:50 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా జట్టుకు టీంఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ వార్నింగ్ ఇచ్చాడు. పెర్త్ టెస్ట్ ఓటమి తర్వాత కూడా ఆసీస్ జట్టు మంచి పెర్ఫామెన్స్ ఇవ్వకుంటే ఇది వారికి చాలా కాలం గుర్తిండి పోయే సిరీస్ కానుందన్నాడు. న్యూజిలాండ్‌తో 0-3 తేడాతో ఓటమి తర్వాత అనేక ఇంటర్వ్యూల్లో పాల్గొనట్లు గంగూలీ చెప్పాడు. చాలా మంది ఆస్ట్రేలియా చేతిలో భారత్ చిత్తుగా ఓడిపోతుందని తనతో చెప్పినట్లు గుర్తు చేశాడు. ఆస్ట్రేలియా మీడియాలో సైతం ఇలాంటి వార్తలో వచ్చాయన్నారు. అయితే పెర్త్ టెస్ట్ తర్వాత ఎవరు ఎవరిని చిత్తు చేశారో తేలిపోయిందన్నాడు. భారత క్రికెట్‌లో అపారమైన ప్రతిభ ఉందన్నాడు. తొలి టెస్టులో రాణించిన బుమ్రా, కోహ్లీ, జైస్వాల్‌లను గంగూలీ అభినందించాడు. నితీశ్ కుమార్ రెడ్డి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. హైదరాబాద్ కుర్రాడు నితీశ్ రెడ్డి అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడని కొనియాడాడు. సిరీస్ ఫలితం గురించి ఇప్పుడే చెప్పలేమని గంగూలీ అన్నాడు. ఇంకా నాలుగు టెస్ట్‌లు మిగిలి ఉన్నాయని.. ఆడిలైడ్‌లో జరిగే డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ అన్నాడు. పింక్ బాల్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాకు మంచి రికార్డు ఉందన్నాడు.

Tags:    

Similar News