ఆస్ట్రేలియాపై విజయం.. డబ్ల్యూటీసీలో మళ్లీ అగ్రస్థానానికి భారత్

పెర్త్ టెస్టు విజయంతో టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది.

Update: 2024-11-25 12:35 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాపై తొలి టెస్టు విజయంతో టీమిండియా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) పాయింట్స్ టేబుల్‌లో తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. న్యూజిలాండ్‌తో సిరీస్ ఓటమి తర్వాత భారత జట్టు రెండో స్థానానికి పడిపోగా.. ఆసిస్ టాప్ ర్యాంక్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. తాజాగా పెర్త్ విజయంతో టీమిండియా.. ఆస్ట్రేలియాను వెనక్కినెట్టి తిరిగి నం.1 స్థానానికి చేరుకుంది. 58.33 పర్సంటేజ్ నుంచి 61.11 పర్సంటేజ్‌కు పెంచుకుంది. ఇప్పటివరకు డబ్ల్యూటీసీ 2023-25 సర్కిల్‌లో భారత్ 15 మ్యాచ్‌ల్లో 9 విజయాలు నమోదు చేయగా.. ఒక డ్రా, ఐదు ఓటములు పొందింది. మరోవైపు, తాజా ఓటమితో ఆస్ట్రేలియా రెండో స్థానానికి పడిపోయింది. పాయింట్స్ పర్సంటేజ్ 62.50 శాతం నుంచి 57.69 శాతానికి పడిపోయింది. శ్రీలంక(55.56), న్యూజిలాండ్(55.55), సౌతాఫ్రికా(54.17) వరుసగా టాప్-5లో ఉన్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ సాధించాలంటే ఈ సిరీస్‌ భారత్‌కు చాలా కీలకం. పెర్త్‌లో విజయంతో జట్టు అవకాశాలు మెరుగపడగా.. సిరీస్‌ను 4-0తో దక్కించుకుంటేనే నేరుగా ఫైనల్‌కు చేరుకోవచ్చు. లేదంటే భారత్ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

Tags:    

Similar News