ICC ODI World Cup 2023: ఈసారి అతడే టాప్ స్కోరర్.. సౌతాఫ్రికా లెజెండ్
ఈ ఏడాది జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ గురించి సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాక్వెస్ కలిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ గురించి సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ జాక్వెస్ కలిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వన్డే ప్రపంచకప్‌లో ఏ బ్యాటర్ ఎక్కువ పరుగులు చేస్తాడో జోస్యం చెప్పాడు. భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ జోస్ బట్లర్ టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని జోస్యం చెప్పాడు. భారత పిచ్‌లపై అతడు ఈసారి మెరుగ్గా రాణిస్తాడని భావిస్తున్నా. ఇంగ్లండ్ ఈ వరల్డ్‌కప్‌లో కూడా మంచి ప్రదర్శన ఇస్తుందనే నమ్మకం ఉందని కలిస్ అభిప్రాయపడ్డాడు. అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు భారత్ వేదికగా వరల్డ్‌కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
ఇప్పటివరకు బట్లర్ 165 వన్డేల్లో 41.49 సగటుతో 4,647 పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు, 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే.. భారత్‌లో మాత్రం బట్లర్ వన్డే రికార్డు మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటి వరకు భారత గడ్డపై 8 వన్డే మ్యాచ్‌లు ఆడిన బట్లర్.. కేవలం 83 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 31 మాత్రమే. ఈ నేపథ్యంలో భారత్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీలో జోస్ బట్లర్ టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని జాక్వెస్ కలిస్ అంచనా వేయడం గమనార్హం.