ISSF: జూనియర్ షూటింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియాకు మరో గోల్డ్ మెడల్..16కు చేరిన పతకాల సంఖ్య

పెరూ(Peru) రాజధాని లిమా(Lima) వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌(ISSF Junior shooting World Championship)లో భారత యువ షూటర్లు(Indian Youth Shooters) అదరగొడుతున్నారు.

Update: 2024-10-04 12:44 GMT

దిశ, వెబ్‌డెస్క్:పెరూ(Peru) రాజధాని లిమా(Lima) వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌(ISSF Junior shooting World Championship)లో భారత యువ షూటర్లు(Indian Youth Shooters) అదరగొడుతున్నారు.ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు 15 పతకాలు గెలుచుకోగా తాజాగా మరో పతకం సాధించింది. ఈ రోజు జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో టీమిండియా త్రయం ముకేశ్ నేలవల్లి(Mukesh Nelavalli),రాజవర్ధన్ పాటిల్ (Raajwardan Patil),హర్సీమర్ సింగ్(Harsimar Singh) గోల్డ్ మెడల్ గెలిచారు.దీంతో భారత పతకాల సంఖ్య 16 కు చేరుకుంది. ఇందులో 11 గోల్డ్,1 సిల్వర్, 4 బ్రాన్జ్ మెడల్స్ ఉన్నాయి.కాగా ఈ టోర్నీలో భారత్(India) మొత్తం 16 పతకాలతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా..మూడు స్వర్ణాలు, ఒక రజతంతో చైనా(China) రెండో స్థానంలో ఉంది.


Similar News