ICC Womens T20: బోణీ కొడతారా..! నేడు న్యూజిలాండ్‌తో తలపడనున్న భారత్

యూఏఈ (UAE) వేదికగా జరుగుతున్న ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌ (ICC Women's T20 World Cup)లో భాగంగా భారత అమ్మాయిల జట్టు తొలి పోరుకు సిద్ధమైంది.

Update: 2024-10-04 05:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: యూఏఈ (UAE) వేదికగా జరుగుతున్న ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌ (ICC Women's T20 World Cup)లో భాగంగా భారత అమ్మాయిల జట్టు తొలి పోరుకు సిద్ధమైంది. ఇన్నేళ్లుగా కలగానే మిగిలిన ఐసీసీ ట్రోఫీ (ICC Trophy)ని ముద్దాడాలని జట్టు మైదానంలోకి దిగబోతోంది. గ్రూప్‌-Aలో భాగంగా టీమిండియా శుక్రవారం న్యూజిలాండ్‌ (New Zealand) జట్టుతో తలపడబోతోంది. ఎలాగైనా శాయశక్తులు ఒడ్డి అత్యుత్తమ ప్రదర్శన చేసి ఫైనల్ చేరాలని భారత జట్టు కలలు కంటోంది. అన్ని విభాగాల్లో భారత్ పటిష్టంగా కనిపిస్తున్నా.. గెలివాల్సిన మ్యాచ్‌ల్లో మాత్రం చేతులెత్తేస్తోంది.

ముఖ్యంగా ఓపెనర్లు త్వరగా వికెట్లను కోల్పోతే.. ఆ తరువాత వచ్చే బ్యాట్స్‌మెన్లు అనవసర తప్పిదాలు చేస్తూ చేజేతులా తమ వికెట్లను ప్రత్యర్థులకు సమర్పించుకుంటున్నారు. ఈ క్రమంలో అలాంటి తప్పులు పునరావృతం కాకుండా వార్మప్ మ్యాచ్‌ (Warm-up match)లలో జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లోని లోపాలను సరిచేసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ మేరకు కఠిన సమయాల్లో ఒత్తిడిని ఎదర్కొనేందుకు ప్రతి ప్లేయర్‌కు నేషనల్ క్రికెట్ అకాడమీ (National Cricket Academy)లో ప్రత్యేక శిక్షణను సైతం ఇచ్చారు.

అయితే, జట్టు పరంగా కెప్టెన్ హర్మన్‌ ప్రీత్ కౌర్, స్మృతి మందాన, జెమీమా, షఫాలీ, దీప్తిశర్మ బ్యాటింగ్‌లో అదరగొడ్తున్నారు. ముఖ్యంగా. షఫాలీ వర్మ, స్మృతి ఫామ్‌లో ఉంటటం జట్టుకు మరింత బూస్ట్‌ను ఇస్తుంది. ఇటీవల జరిగిన చివరి ఐదు టీ20ల్లో మంధాన ఏకంగా 5 హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టింది. అదేవిధంగా కఠినమైన యూఏఈ పిచ్‌లపై భారీ స్కోర్ సాధించడం పట్ల దృష్టి పెట్టాలని సినీయర్లు జట్టుకు సూచనలు చేస్తున్నారు. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే.. పూజా వస్త్రాకర్‌, తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్‌‌లలో ఇద్దరు తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. జట్టులో అందరూ తమ వంతు సహాకారం అందిస్తేనే అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించడం ఈజీ అవుతుందని జట్టు కూడా భావిస్తుంది. ఇక ప్రత్యర్థి న్యూజిలాండ్ (New Zealand) జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. సోఫీ డివైన్‌ సారథ్యంలో సీనియర్‌ ఆల్‌రౌండర్‌ సుజీ బేట్స్‌, వెటరన్‌ పేసర్లు లియా తహుహు, లీగ్‌ కాస్పెరెక్‌ ఫామ్‌తో బ్లాక్ క్యాప్స్ భారత జట్టుకు సవాలు విసురుతోంది. దుబాయ్ (Dubai) వేదికగా భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది.

భారత జట్టు 

హర్మన్‌ప్రీత్‌ (C), స్మృతీ మంధాన, షఫాలీ వర్మ, దీప్తిశర్మ, జెమీమా, రిచా (WK), యాస్తిక, వస్త్రాకర్‌, అరుంధతి రెడ్డి, రేణుకాసింగ్‌, హేమలత, ఆశ, రాధా యాదవ్‌, శ్రేయాంక, సజన.

న్యూజిలాండ్ జట్టు 

సోఫీ డివైన్‌ (C), సుజీ బేట్స్‌, అమీలియా కెర్‌, కార్సన్‌, ఇసబెల్లా గేజ్‌ (WK), లియా తహుహు, మ్యాడీ గ్రీన్‌, బ్రూక్‌ హాలీడే, ఫ్రాన్‌ జొనాస్‌, లీ కాస్పెరెక్‌, జాస్‌ కెర్‌, రోస్‌మేరీ, మోలీ పెన్‌ఫోల్డ్‌, జార్జియా ప్లిమెర్‌, హనా.  


Similar News