Rashid Khan Marriage: వివాహం చేసుకున్న అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్‌ ఖాన్‌ ..నెట్టింట్లో ఫోటోలు వైరల్

అఫ్గానిస్థాన్(Afghanistan) స్టార్ క్రికెటర్,మాజీ వరల్డ్ నంబర్ వన్ T20 స్పిన్నర్ 26 ఏళ్ల రషీద్‌ ఖాన్‌(Rashid Khan) వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు.

Update: 2024-10-04 13:45 GMT

దిశ, వెబ్‌డెస్క్:అఫ్గానిస్థాన్(Afghanistan) స్టార్ క్రికెటర్,మాజీ వరల్డ్ నంబర్ వన్ T20 స్పిన్నర్ 26 ఏళ్ల రషీద్‌ ఖాన్‌(Rashid Khan) వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. గురువారం రాత్రి అఫ్గాన్ రాజధాని కాబూల్‌(Kabul)లోని ఇంపీరియల్ కాంటి‌నెంటల్(Imperial Continental) హోటల్‌లో అతడి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.కాగా రషీద్ వివాహం(Marriage)తో పాటు అతడి ముగ్గురు సోదరుల పెళ్లి ఒకేసారి జరగడం విశేషం. వీరి వివాహం అఫ్గానిస్థాన్ సంప్రదాయం పష్తూన్‌ ఆచారాల ప్రకారం జరిగింది.ఈ వేడుకకు అఫ్గాన్‌ క్రికెటర్లతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.రషీద్‌ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.దీంతో క్రికెట్‌ అభిమానులు రషీద్‌ ఖాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక రషీద్‌ ఖాన్‌ టీ20ల్లో పలు ప్రాంఛైజీ జట్లకు ఆడుతున్నారు. అలాగే ఐపీఎల్‌లో గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) ప్రాంఛైజీ తరుపున ఆడిన రషీద్ ప్రస్తుతం గుజరాత్‌ టైటాన్స్‌(Gujarat Titans)కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.


Similar News