Rishabh Pant: రిషభ్ పంత్ అరుదైన ఫీట్.. తొలి వికెట్ కీపర్‌గా వరల్డ్ రికార్డ్
టీమిండియా (Team India) వికెట్ కీపర్, పించ్ హిట్టర్ రిషభ్ పంత్ (Rishabh Pant) సరికొత్త చరిత్రను లిఖించాడు.
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా (Team India) వికెట్ కీపర్, పించ్ హిట్టర్ రిషభ్ పంత్ (Rishabh Pant) సరికొత్త చరిత్రను లిఖించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (World Test Championship) చరిత్రలో 2 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి వికెట్ కీపర్ (Wicket Keeper)గా రికార్డుల్లోకి ఎక్కాడు. ప్రస్తుతం బోర్డర్-గవస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో రిషభ్ పంత్ ఈ అరుదైన ఘనతను సాధించాడు. తొలిటెస్ట్‌లో తొలిరోజు రిషభ్ పంత్ (Rishabh Pant) 78 బంతుల్లో 37 పరుగులు చేశాడు. అయితే, ఆ పరుగులు కలుపుకుని వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (World Test Championship) లో అతడు మొత్తం 2,034 పరుగులు చేశాడు. దీంతో WTC చరిత్రలోనే 2 వేల పరుగుల మార్క్ దాటిన తొలి వికెట్ కీపర్‌గా గుర్తింపు పొందాడు. కాగా, కివీస్ ఆటగాడు టామ్ లాథమ్ (Tom Latham), ఇంగ్లాండ్ వికెట్ కీపర్ ఓలీపోప్ (Ollie Pope) ఇప్పటికే 2 వేల పరుగులు దాటేసినా.. వారు కీపింగ్ బాధ్యతలను రెగ్యులర్‌గా నిర్వహించ లేదు. డబ్ల్యూటీసీ (WTC) చరిత్రలో 2వేల పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్‌గా రిషభ్ పంత్ (Rishabha Pant) నిలిచాడు. అంతకు ముందు ఈ జాబితాలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (2,685), విరాట్ కోహ్లీ (2,432).. రిషభ్ పంత్ (2,034) కంటే ముందున్నారు.