లక్నో జట్టుకు షాక్.. ఈ సీజన్ నుంచి రూ.6.4కోట్ల స్టార్ ఔట్

లక్నో సూపర్ జాయింట్స్ కి షాక్ తగిలింది. కోట్లు ఖర్చు చేసి దక్కించుకున్న స్టార్ పేసర్ జట్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా ఐపీఎల్ సీజన్ కు దూరమయ్యాడు శివం మావి.

Update: 2024-04-03 14:03 GMT

దిశ, స్పోర్ట్స్: లక్నో సూపర్ జాయింట్స్ కి షాక్ తగిలింది. కోట్లు ఖర్చు చేసి దక్కించుకున్న స్టార్ పేసర్ జట్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా ఐపీఎల్ సీజన్ కు దూరమయ్యాడు శివం మావి. ఈ విషయాన్ని లక్నో జట్టు అధికారికంగా ప్రకటించింది.

లక్నో టీం ప్రకటన

దురదృష్టవశాత్తూ లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు నుంచి శివం మావి దూరమయ్యాడని తెలిపింది లక్నో యాజమాన్యం. గాయం కారణంగా ఈ సీజన్ కు అందుబాటులో ఉండడని ప్రకటించింది. టాలెంటెడ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ని డిసెంబరులో జరిగిన వేలంలో కొనుగోలు చేశామని పేర్కొంది. ప్రీసీజన్ క్యాంపులోనూ జట్టులో పాల్గొన్నట్లు స్పష్టం చేసింది. ఈ సీజన్ లో జట్టులో కీలక ఆటగాడిగా ఉంటాడని ఆశించినట్లు తెలిపింది. కానీ, ఇలాంటి టైంలో గాయం కావడంతో శివం కూడా నిరాశచెందినట్లు పేర్కొంది. లక్నో యాజమాన్యం ఎల్లప్పుడూ శివంకు అండగా ఉంటుందని స్పష్టం చేసింది. గాయం నుంచి కోలుకునేందుకు శివం వామికి కావాల్సిన సాయం చేస్తామని తెలిపింది. పూర్తి ఫిట్ నెస్ సాధించి మరింత స్ట్రాంగ్ గా తిరిగి రావాలని లక్నో మేనేజ్ మెంట్ మావిని విష్ చేసింది.

మ్యాచ్ లు ఆడతా అనుకున్నా..

ఐపీఎల్ లో మ్యాచ్‌లు ఆడతానని.. జట్టులో రాణిస్తానని అనుకున్నట్లు తెలిపాడు శివం మావి. సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ లో శివం మావి వీడియోని పోస్టు చేసింది లక్నో జట్టు. దురదృష్టవశాత్తు గాయం కారణంగా తాను వెళ్ళవలసి వచ్చిందని ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఒక క్రీడాకారుడు మానసికంగా దృఢంగా ఉండాలని, రీహాబిలిటేన్ పలు అంశాలపై దృష్టి సారించాలని అన్నాడు. ఇక్కడ మంచి టీం ఉందని.. దృఢంగా తిరిగి వస్తానని పేర్కొన్నాడు.

ఆవేశ్ ఖాన్ స్థానంలో..

గతేడాది జనవరిలో టీమిండియాలో అడుగుపెట్టి ఇప్పటి వరకు ఆరు టీ20లు ఆడి ఏడు వికెట్లు తీశాడు. ఇకపోతే 2018లో కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు పేసర్ శివం మావి. 2022 వరకు కేకేఆర్ తరఫున్నే ఆడాడు. తర్వాత రూ.6 కోట్లకు అతడ్ని గుజరాత్ కొనుగోలు చేసింది. 2022లో గుజరాత్ తరఫున 6 మ్యాచ్ లు ఆడి 5 వికెట్లు తీశాడు. అయితే, ఐపీఎల్‌-2023లో గుజరాత్‌కు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయిన శివం మావిని ఫ్రాంఛైజీ వదిలేసింది. డిసెంబర్ లో జరిగిన వేలంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ రూ.6.4 కోట్లు పెట్టి శివం మావిని జట్టులోకి తీసుకుంది. ఆవేశ్ ఖాన్ రాజస్థాన్ రాయల్స్ కు వెళ్లిపోయాడు. దీంతో అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు శివంమావిని జట్టులోకి తీసుకుంది. ఇక ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో లక్నో రెండు గెలిచింది.


Similar News