Cricket: 2028 ఒలింపిక్ క్రీడ‌ల్లో క్రికెట్‌.. 128 ఏళ్ల త‌ర్వాత రీఎంట్రీ

Update: 2023-10-13 10:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చేప్పిన ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. 2028 ఇయర్‌లో లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇచ్చారు. దీనిపై తుది ప్రక‌ట‌న సోమ‌వారం వెలువ‌డే ఛాన్సు ఉంది. అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ ప్రతినిధి క్రికెట్‌కు ఆమోదం తెలిపిన‌ట్లు శుక్రవారం ప్రక‌టన చేశారు. ముంబైలో జ‌రిగిన ఐఓసీ ఎగ్జిక్యూటీ బోర్డు మీటింగ్‌లో పాల్గొన్న అధ్యక్షుడు థామ‌స్ బాచ్ ఈ విష‌యాన్ని తెలిపారు.

ఒలింపిక్స్‌లో కొత్తగా అయిదు క్రీడ‌ల‌ను చేర్చాల‌నుకున్నార‌ని, దాంట్లో క్రికెట్ కూడా ఉంద‌ని, ఆ ప్రతిపాద‌న‌కు లాస్ ఏంజిల్స్ నిర్వాహ‌కులు ఆమోదించిన‌ట్లు థామ‌స్ బాచ్ పేర్కొన్నారు. బేస్‌బాల్‌, సాఫ్ట్‌బాల్‌, ఫ్లాగ్ ఫుట్‌బాల్‌, స్క్వాష్‌, లాక్రోసీ క్రీడ‌ల‌ను ఒలింపిక్స్‌లో ఆడించే ఛాన్సు ఉంది. దాదాపు 128 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆట‌ను చేర్చారు. చివ‌రిసారి 1900 సంవ‌త్సరంలో పారిస్‌లో జ‌రిగిన ఒలింపిక్ క్రీడ‌ల్లో క్రికెట్ ఆడించారు.


Similar News