సుల్తాన్ ఆఫ్ జోహోర్ కప్‌కు జూనియర్ హాకీ జట్టు ఎంపిక

ఈ నెలాఖరులో మలేషియాలో జరగబోయే 12వ సుల్తాన్ ఆఫ్ జోహోర్ కప్‌లో పాల్గొనే భారత జూనియర్ పురుషుల హాకీ జట్టును హాకీ ఇండియా ఆదివారం ప్రకటించింది.

Update: 2024-10-06 19:58 GMT

దిశ, స్పోర్ట్స్ : ఈ నెలాఖరులో మలేషియాలో జరగబోయే 12వ సుల్తాన్ ఆఫ్ జోహోర్ కప్‌లో పాల్గొనే భారత జూనియర్ పురుషుల హాకీ జట్టును హాకీ ఇండియా ఆదివారం ప్రకటించింది. 18 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. డిఫెండర్ అమిర్ అలీని కెప్టెన్‌గా ఎంపిక చేయగా.. రోహిత్ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. అలాగే, మాజీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్‌ను జూనియర్ హాకీ జట్టు హెడ్ కోచ్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీతో అతను ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇటీవల ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సీనియర్ జట్టుకు అమిర్ అలీ, ఫార్వార్డ్ గుర్జోత్ సింగ్ ఆడారు. ఈ నెల 19న జపాన్‌తో మ్యాచ్‌తో భారత్ టోర్నీని ఆరంభించనుంది. ఆ తర్వాత 20న గ్రేట్ బ్రిటన్‌తో, 22న మలేషియాతో, 23న ఆస్ట్రేలియాతో, 25న న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఆరు జట్లు పాల్గొనే ఈ టోర్నీలో టాప్-2 జట్లు ఫైనల్ ఆడతాయి.

భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు

గోల్‌కీపర్స్ : బిక్రామ్‌జిత్ సింగ్, అలీ ఖాన్, డిఫెండర్స్ : అమిర్ అలీ(కెప్టెన్), తాలెం ప్రియో బర్తా, శార్దానంద్ తివారి, సుఖ్విందర్, అన్మోల్ ఎక్కా, రోహిత్, మిడ్ ఫీల్డర్స్ : అంకిత్ పాల్, మన్‌మీత్ సింగ్, రోసన్ కుజుర్, ముకేశ్ టొప్పొ, చందన్ యాదవ్, ఫార్వార్డ్స్ : గుర్జోత్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, సౌరబ్ ఆనంద్, దిల్‌రాజ్ సింగ్, మహ్మద్ కొనైన్ డాడ్.


Similar News