ఒకే మ్యాచ్‌లో పలు రికార్డులు బ్రేక్ చేసిన భారత్

భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆదివారం రాత్రి మొదటి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి.. టీ20లలో విజయ పరంపరను కొనసాగించింది.

Update: 2024-10-07 05:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆదివారం రాత్రి మొదటి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి.. టీ20లలో విజయ పరంపరను కొనసాగించింది. ఈ విజయంతో భారత్ అనేక రికార్డులను బ్రేక్ చేసింది. ముందుగా.. ఈ మ్యాచ్ తో ఇంటర్నేషనల్ జట్టులోకి అరంగేట్రం చేసిన మయాంక్ యాదవ్, మొదటి ఓవర్ ను మెడిన్ చేసి, రెండో ఓవర్ మొదటి బంతికి వికెట్ తీసుకున్నాడు. దీంతో సున్నా పరుగులకే తొలి వికెట్ల తీసుకున్న ప్లేయర్ల జాబితాలో మయాంక్ యాదవ్ చేరిపోయాడు. అలాగే బంగ్లాదేశ్ నిర్ధేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని అతి తక్కువ బంతుల్లో చేజ్ చేసిన భారత మరో రికార్డును బ్రేక్ చేసింది.

టీ20 మ్యాచ్‌లో 120 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యంత వేగంగా(71 బంతుల్లో) చేజ్ చేసిన జట్టుగా భారత్ నిలిచింది. కాగా గతంలోనే భారత్ బంగ్లా పైనే 120 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని వేగంగా(83 బంతుల్లో) చేజ్ చేసిన జట్టుగా రికార్డును కలిగి ఉంది. అలాగే ఇదే మ్యాచులో బంగ్లా జట్టును 19.5 ఓవర్లకు ఆలౌట్ చేసింది. దీంతో పాకిస్థాన్ జట్టు పేరు పై ఉన్న అత్యధిక ఆలౌట్ రికార్డును భారత్ సమం చేసింది. కాగా ఇప్పటి వరకు పాకిస్థాన్ జట్టు టీ20 లలో అత్యధిక సార్లు(42) ప్రత్యర్థులను ఆలౌట్ చేసిన రికార్డును కలిగి ఉండగా ఇప్పుడు భారత జట్టు కూడా అదే స్థానంలో వచ్చింది.


Similar News