మెరిసిన యువ బ్యాటర్లు.. బంగ్లాదేశ్ పై భారత్ భారీ విజయం

భారత్, బంగ్లాదేశ్ మధ్య టీ20 గ్వాలియర్ లో జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోవడంతో బంగ్లాదేశ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.

Update: 2024-10-06 16:28 GMT

దిశ, వెబ్ డెస్క్: భారత్, బంగ్లాదేశ్(IND vs BAN) మధ్య టీ20 గ్వాలియర్ లో జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోవడంతో బంగ్లాదేశ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. భారత యువ బౌలర్లు బంగ్లా పై రెచ్చిపోవడంతో 19.5 ఓవర్లకు బంగ్లా జట్టు 127 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 128 పరుగుల లక్ష్యంతో చేజింగ్ దిగిన భారత యువ బ్యాటర్లు బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓ పక్క వికెట్లు పడుతున్నప్పటికీ.. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు ఫోర్లు సిక్సర్లతో రెచ్చిపోయారు. ముఖ్యంగా ఓపెనర్లు శాంసన్ 29, అభిషేక్ శర్మ 16, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 29, హర్దిక్ పాండ్యా 39, నితీష్ కుమార్ రెడ్డి 16 పరుగులతో రాణించారు. దీంతో 11.5 ఓవర్లలోనే 132 పరుగులు చేసిన మరో 49 బంతులు మిగిలి ఉండగానే.. 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.


Similar News