Asia cup 2023: ఆసియా కప్‌కు ముందు పాకిస్తాన్‌ క్రికెట్‌ కీలక నిర్ణయం..!

పీసీబీ చైర్‌పర్సన్‌గా జాకా అష్రాఫ్ నియమితులైన తర్వాత పాక్‌ క్రికెట్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Update: 2023-08-06 12:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: పీసీబీ చైర్‌పర్సన్‌గా జాకా అష్రాఫ్ నియమితులైన తర్వాత పాక్‌ క్రికెట్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే మిస్బా ఉల్‌ హక్‌, ఇంజమామ్ ఉల్‌ హక్‌, మహ్మద్ హఫీజ్‌లతో కూడిన క్రికెట్ టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసిన అష్రాష్‌.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ ఛీప్‌గా నజామ్ సేథీ ఉన్న సమయంలో ఆ జట్టు కోచ్‌లు మిక్కీ ఆర్థర్, బ్రాడ్‌బర్న్, డేటా ఎనలిస్ట్‌ హసన్‌ చీమాకు కూడా పాకిస్తాన్‌ సెలక్షన్‌ కమిటీలో భాగమయ్యారు. ఇప్పుడు వారిని సెలక్షన్‌ కమిటీలో కొనసాగించాలా లేదా అన్నది కూడా క్రికెట్ టెక్నికల్ కమిటీ సమావేశంలో చర్చించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెలక్షన్‌ ప్యానల్‌లో హెడ్‌ కోచ్‌ ఉండాలా లేదా అన్నది పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంతో కూడా ఈ టెక్నికల్‌ కమిటీ చర్చించనుంది. ఆసియాకప్‌కు జట్టు ఎంపిక ముందు కొత్త సెలక్షన్‌ ప్యానల్‌ను ఖారారు చేసే అవకాశం ఉంది.


Similar News