ఏషియన్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత వెయిట్‌లిఫ్టర్‌కు రజతం..
సౌత్ కొరియాలో జరుగుతున్న ఏషియన్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ జెరేమీ లాల్రినుంగా స్నాచ్ కేటగిరీలో రజతం సాధించాడు.
జింజు: సౌత్ కొరియాలో జరుగుతున్న ఏషియన్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ జెరేమీ లాల్రినుంగా స్నాచ్ కేటగిరీలో రజతం సాధించాడు. ఆదివారం 67 కేజీల కేటగిరీలో పోటీపడిన అతను స్నాచ్ విభాగంలో 141 కిలోలు ఎత్తి రెండో స్థానంలో నిలిచి పతకం దక్కించుకున్నాడు. కానీ, మొత్తం ఈవెంట్‌లో మాత్రం అతను నిరాశపరిచాడు.
క్లీన్ అండ్ జర్క్ విభాగంలో జెరేమీ మూడు ప్రయత్నాల్లోనూ బరువులు ఎత్తడంలో విఫలమయ్యాడు. మొదటి రెండు ప్రయత్నాల్లో 165 కేజీలు ఎత్తబోయి విఫలమైన అతను.. మూడో ప్రయత్నంలో 168 కిలోలు ఎత్తలేకపోయాడు. అయితే, స్నాచ్ విభాగంలో మాత్రం రజతంతో మెరిశాడు. గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో జెరేమీ స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే.