ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-1లో ఫైనల్‌కు ధీరజ్ జట్టు
చైనాలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగు కుర్రాడు ధీరజ్ బొమ్మదేవర సత్తాచాటాడు.
దిశ, స్పోర్ట్స్ : చైనాలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగు కుర్రాడు ధీరజ్ బొమ్మదేవర సత్తాచాటాడు. గురువారం జరిగిన పురుషుల రికర్వ్ టీమ్ కేటగిరీలో తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌లతో కలిసి ధీరజ్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీస్‌లో భారత త్రయం 5-1(55-54, 55-55, 56-55) తేడాతో ఇటలీ జట్టును ఓడించింది. అంతకుముందు తొలి రౌండ్‌లో బై పొందిన భారత జట్టు.. రెండో రౌండ్‌లో 5-3 తేడాతో ఇండోనేషియాను, క్వార్టర్ ఫైనల్‌లో స్పెయిన్‌ను 5-1 తేడాతో చిత్తు చేసింది. ఫైనల్‌కు చేరుకోవడంతో భారత జట్టుకు పతకం ఖాయమైంది. గోల్డ్ మెడల్ కోసం ఆదివారం జరిగే ఫైనల్‌లో టాప్ సీడ్ సౌత్ కొరియాను ఎదుర్కోనుంది. మరోవైపు, అంకిత, దీపక కుమారి, భజన్ కౌర్‌లతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు నిరాశపర్చింది. రెండో రౌండ్‌లో మెక్సి్కో చేతిలో 5-3 తేడాతో పరాజయం పాలైంది.