పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం.. 4వ స్థానానికి ఎగబాకిన భారత హాకీ జట్టు

పారిస్ ఒలింపిక్స్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించిన విషయం తెలిసిందే.

Update: 2024-08-12 12:23 GMT

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించిన విషయం తెలిసిందే. టోక్యో విశ్వక్రీడల్లో బ్రాంజ్ మెడల్ నెగ్గిన తర్వాత వరుసగా ఇది రెండో పతకం. పారిస్‌లో అదరగొట్టిన భారత హాకీ జట్టు వరల్డ్ ర్యాంకింగ్స్‌లోనూ ర్యాంక్‌ను మెరుగుపర్చుకుంది. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్(ఎఫ్‌ఐహెచ్) సోమవారం రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో భారత్ 4వ స్థానానికి చేరుకుంది. పారిస్ క్రీడలకు ముందు భారత్ 5వ స్థానంలో ఉన్నది. ఒలింపిక్స్‌లో నిలకడ ప్రదర్శన, అద్భుత విజయాలతో భారత్ ఒక్క స్థానాన్ని ఎగబాకింది. ౌః

గ్రూపు దశలో అర్జెంటీనాతో 1-1తో డ్రా చేసుకున్న భారత్.. ఆస్ట్రేలియాపై 3-2తో అపూర్వ విజయం సాధించింది. ఇక, క్వార్టర్స్‌లో గ్రేట్ బిటన్‌ను షూటౌట్‌లో మట్టికరిపించగా.. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో స్పెయిన్‌ను 2-1 తేడాతో చిత్తు కాంస్యం దక్కించుకుంది. ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నెదర్లాండ్స్ అగ్రస్థానంలో నిలువగా.. సిల్వర్ మెడల్ సాధించిన జర్మనీ 5వ స్థానం నుంచి 2వ ర్యాంక్‌కు ఎగబాకింది. ఇంగ్లాండ్ మూడో స్థానంలో కొనసాగుతుండగా.. బెల్జియం ఒక్క స్థానం కోల్పోయి 5వ ర్యాంక్‌కు, ఆస్ట్రేలియా 4వ స్థానం నుంచి 6వ ర్యాంక్‌కు పడిపోయాయాయి. మరోవైపు, మహిళల ర్యాంకింగ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు టాప్-10లో చోటు కాపాడుకుంది. 9వ స్థానంలో కొనసాగుతోంది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించకపోయినా ఇంటర్నేషనల్ టోర్నీలో ప్రదర్శన ర్యాంక్‌ను నెలబెట్టింది. 

Tags:    

Similar News