IND vs WI 2nd T20I: విండీస్‌తో రెండో టీ20.. టాస్ గెలిచిన హార్ధిక్ పాండ్యా..

గయానాలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

Update: 2023-08-06 14:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: గయానాలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ట్రినిడాడ్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల తేడాతో పోరాడి ఓడింది. ఈ మ్యాచ్‌లో ఓ మార్పుతో బరిలోకి దిగుతుంది. తొలి టీ20 ఆడిన కుల్దీప్‌ యాదవ్‌ స్థానంలో రవి బిష్ణోయ్‌ బరిలోకి దిగనున్నాడు. మరోవైపు విండీస్‌ తొలి మ్యాచ్‌ ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది.

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI):

కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ (w), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్ (సి), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్

భారత్ (ప్లేయింగ్ XI):

శుభమన్ గిల్, ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), సంజు శాంసన్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్‌, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్



Similar News