U19 Asia Cup 2024 : అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ .. సెమీస్‌కు యువ భారత్

అండర్-19 ఆసియా కప్‌లో యువ భారత్ సెమీస్‌కు చేరింది.

Update: 2024-12-04 12:05 GMT

దిశ, స్పోర్ట్స్ : అండర్-19 ఆసియా కప్‌లో యువ భారత్ సెమీస్‌కు చేరింది. బుధవారం షార్జాలో యూఏఈతో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 44 ఓవర్లలో 137 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఒక్క వికెట్ కోల్పోకుండానే లక్ష్యాన్ని 16.1 ఓవర్లలోనే చేధించింది. ఐపీఎల్ వేలంలో రూ.కోటి 10 లక్షల ధర పలికిన వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో కేవలం 46 బంతుల్లో 76 పరుగులు చేసి అదరగొట్టాడు. మొత్తం ఆరు సిక్సులు, 3 ఫోర్లు బాది స్కోరు బోర్డును పరిగెత్తించాడు. మరో ఓపెనర్ అయూష్ మాత్రే 51 బంతుల్లో 67 పరుగులు చేయడంతో భారత్ సునాయసంగా విజయం సాధించింది. భారత బౌలర్లలో యుధాజిత్ 3, చేతన శర్మ, హార్ధిక్ రాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. యూఏఈ బ్యాట్స్‌మెన్లలో రయన్ ఖాన్ (35), అక్షత్ రాయ్ (26)లు మాత్రమే పర్వాలేదనిపించారు. ఈ నెల6న(శుక్రవారం) భారత్ సెమీస్‌లో శ్రీలంకతో తలపడనుంది. ఫైనల్ డిసెంబర్ 10న దుబాయ్ వేదికగా జరగనుంది.

Tags:    

Similar News