World Chess Championship 2024 : గుకేష్, డింగ్ లిరెన్ మధ్య 8వ గేమ్ డ్రా..

ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత యువ సంచలనం డి.గుకేష్, చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ మధ్య 8వ గేమ్ సైతం డ్రాగా ముగిసింది.

Update: 2024-12-04 15:48 GMT

దిశ, స్పోర్ట్స్ : ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత యువ సంచలనం డి.గుకేష్, చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ మధ్య 8వ గేమ్ సైతం డ్రాగా ముగిసింది. సింగపూర్‌లో జరుగుతున్న టోర్నీలో బుధవారం వరుసగా ఆరో మ్యాచ్ సైతం డ్రాగా ముగిసింది. 14 గేమ్‌ల సిరీస్‌లో ఇద్దరు ఆటగాళ్లు 4-4 పాయింట్లతో సమవుజ్జీలుగా కొనసాగుతున్నారు. ఇంకా 6 గేమ్‌లు మిగిలి ఉన్నాయి. మొదట 7.5 పాయింట్లు చేరుకున్న ఆటగాడు విజేతగా నిలుస్తాడు. 41, 51 ఎత్తుల తర్వాత డ్రాను గుకేష్ తిరస్కరించాడు. విజయం కోసం కావాల్సినన్ని పావులు లేకపోవడంతో గుకేష్ చివరికి డ్రాను అంగీకరించాడు. ఆచితూచి వ్యవహరించిన లిరెన్ నాలుగు గంటల ఆట తర్వాత గేమ్‌ను డ్రా వైపు నడిపించాడు. రాబోయే రెండు గేమ్‌లు తుది ఫలితాన్ని నిర్దేశించనున్నాయి.

Tags:    

Similar News