Sara Tendulkar : సచిన్ ఫౌండేషన్ డైరెక్టర్‌గా సారా టెండూల్కర్
భారత్ లెజెండరీ క్రికెటర్ సచిన్ తన కూతురు సారా టెండూల్కర్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు.
దిశ, స్పోర్ట్స్ : భారత్ లెజెండరీ క్రికెటర్ సచిన్ తన కూతురు సారా టెండూల్కర్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్‌కు సారాను డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు బుధవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా అనౌన్స్ చేశారు. క్రీడలు, ఆరోగ్య సంరక్షణ ద్వారా దేశాన్ని బలోపేతం చేయడానికి సారా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ‘నా కుమార్తె సారాను సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్‌కు డైరెక్టర్‌గా నియమించిందుకు సంతోషిస్తున్నాను. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నుంచి క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌లో తను డిగ్రీ పట్టా పొందింది. క్రీడలు, ఆరోగ్య సంరక్షణ, విద్య ద్వారా భారతదేశాన్ని శక్తివంతం చేయడానికి తన నియామకం దోహదం చేస్తుంది.’ అని సచిన్ ట్వీట్ చేశాడు.