IND vs WI Test Series 2023: టీమిండియా స్టార్‌ బౌలర్‌ ముంగిట అరుదైన రికార్డు..

విండీస్‌తో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది.

Update: 2023-07-11 10:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: విండీస్‌తో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. డొమినిక వేదికగా రేపటి నుంచి ప్రారంభం కాబోయే మ్యాచ్‌లో అశ్విన్‌ మరో 3 వికెట్లు తీస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో 700 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. దీంతో ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్‌గా, అంతర్జాతీయ స్థాయిలో 16వ బౌలర్‌గా, ఓవరాల్‌గా ఆరో స్పిన్నర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు.

ప్రస్తుతం అశ్విన్‌ ఖాతాలో 270 మ్యాచ్‌ల్లో (92 టెస్ట్‌లు, 113 వన్డేలు, 65 టీ20లు) 697 వికెట్లు (టెస్ట్‌ల్లో 474, వన్డేల్లో 151, టీ20ల్లో 72) ఉన్నాయి. అశ్విన్‌కు ముందు భారత స్పిన్నర్లు అనిల్‌ కుంబ్లే (956), హర్భజన్‌ సింగ్‌ (711) మాత్రమే 700 వికెట్ల మైలురాయిని అధిగమించారు.


Similar News