Ind vs WI: టీమిండియా అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే ఏకైక జట్టుగా..

West Indies vs India, 3rd ODI లో వెస్టిండీస్‌ గడ్డపై టీమిండియా ఆఖరి వన్డేలో చిత్తుగా ఓడించి చరిత్ర సృష్టించింది.

Update: 2023-08-02 09:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: West Indies vs India, 3rd ODI లో వెస్టిండీస్‌ గడ్డపై టీమిండియా ఆఖరి వన్డేలో చిత్తుగా ఓడించి చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో 352 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌.. భారత బౌలర్ల ధాటికి 151 పరుగులకే కుప్పకూలింది. ఈ నేపథ్యంలో 200 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. తద్వారా వరుసగా విండీస్‌పై 13 వన్డే సిరీస్‌లు(2007- 2023 మధ్య) గెలిచి చరిత్ర సృష్టించింది.

ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన ఏకైక జట్టుగా రికార్డులకెక్కింది. జింబాబ్వే(1996- 21 మధ్య)పై 11 సార్లు వరుసగా వన్డే సిరీస్‌లు గెలిచిన పాకిస్తాన్‌.. టీమిండియాను ఫాలో అవుతోంది. 10 విజయాలతో టీమిండియా శ్రీలంక(2007-23)పై.. పాకిస్తాన్‌ వెస్టిండీస్‌ (1999-22) ఈ ఫీట్‌ నమోదు చేయడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.


Similar News