IND Vs BAN: మరోసారి అరదగొట్టిన బౌలర్లు.. కాన్పూర్ టెస్టులో భారత్ ఘన విజయం

బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది.

Update: 2024-10-01 09:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. కాన్పూర్ వేదిక‌గా రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. 95 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన భార‌త్ 17.2 ఓవ‌ర్లలో 3 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ య‌శ‌స్వి జైస్వాల్‌ (51; 45 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్ కోహ్లీ (29 నాటౌట్‌) పరుగులు చేశారు.

కాగా, అంతకు ముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 34.4 ఓవర్లలోనే 285/9 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. జైస్వాల్‌ (51 బంతుల్లో 72), రాహుల్‌ (43 బంతుల్లో 68), విరాట్‌ (35 బంతుల్లో 47), గిల్‌ (39) పరుగులు చేశారు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 52 పరుగుల ఆధిక్యం దక్కింది. అయితే, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా జట్టు 2 వికెట్లను కోల్పోయి 26 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం బ్యాటింగ్ వచ్చిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్లు క్రీజ్‌లో నిలదొక్కుకునేందుకు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా టాపార్డర్ ఆటగాళ్లు స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు ధాటికి విలవిలలాడారు. ఆ జట్టులో కేవలం ఓపెనర్ షద్‌మన్ ఇస్లాం 50 పరుగులు, కీపర్ ముష్ఫికర్ రహీం 37 రెండంకెల స్కోర్‌ను సాధించారు. మరోవైపు పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా జట్టు 146 పరుగులకే కుప్పకూలింది.

అనంతరం 95 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి భారత్‌కు ఆరంభంలోని ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 8 పరుగులు చేసి కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. మరో బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, మెహదీ హస్ బౌలింగ్‌లో 6 పరుగులు చేసి పెవీలియన్ చేరాడు. యశస్వీ జైస్వాల్ మరోసారి 51 పరుగులతో చెలరేగాడు. మరోవైపు విరాట్ కోహ్లీ 29 పరుగులు చేసి భారత్‌కు ఘన విజయాన్ని అందించారు. 


Similar News