IND Vs AUS : ప్రాక్టీస్ సెషన్‌లో అభిమానులపై నిషేధం.. టీం ఇండియా ఫిర్యాదుతో చర్యలు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ అడిలైడ్ టెస్ట్‌కు సిద్ధమవుతోంది.
దిశ, స్పోర్ట్స్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ అడిలైడ్ టెస్ట్‌కు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్‌లో బిజీగా గడుపుతున్నారు. అయితే మంగళవారం ప్రాక్టీస్ సందర్భంగా 5000 మంది వరకు అభిమానులు భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్ చూసేందుకు వచ్చారు. అందులో కొంత మంది భారత ఆటగాళ్లను ఇబ్బందులకు గురి చేశారు. దీంతో ఇక నుంచి ఈ టోర్నీ ముగిసే వరకు ప్రాక్టీస్ సందర్భంగా అభిమానులను అనుమతించేది లేదని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తెలిపింది. టీం ఇండియా మేనేజ్‌మెంట్ ఫిర్యాదుతో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఓపెన్ ప్రాక్టీస్ ఏర్పాటు చేయబోమని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. రానున్న ప్రాక్టీస్ సెషన్‌లను పూర్తిగా ఇండోర్‌లోనే నిర్వహించనున్నట్లు తెలిపింది. అడిలైడ్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. ఓపెన్ నెట్ సెషన్స్ వల్ల ఇబ్బంది పడినట్లు తెలిపాడు.