IND Vs AUS: 445 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఆలౌట్.. ఆదిలోనే భారత్‌కు భారీ ఎదురుదెబ్బ

బోర్డర్-గవస్కర్ ట్రోఫీ 2024 (Border-Gavaskar Trophy 2024)లో భాగంగా బ్రిస్బేన్ (Brisbane) వేదికగా జరుగుతోన్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా (Australia) మొదటి ఇన్సింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది.

Update: 2024-12-16 02:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవస్కర్ ట్రోఫీ 2024 (Border-Gavaskar Trophy 2024)లో భాగంగా బ్రిస్బేన్ (Brisbane) వేదికగా జరుగుతోన్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా (Australia) మొదటి ఇన్సింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు 445 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ట్రావిస్ హెడ్ (Travis Head) 160 బంతుల్లో 152 పరుగులు, స్టీవ్ స్మిత్ (Steven Smith) 190 బంతుల్లో 101 పరుగులు, కీపర్ అలెక్స్ కేరీ (Alex Carey) 88 బంతుల్లో 70 పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో జస్ర్పీత్ బుమ్రా (Jasprit Bumrah) 6 వికెట్లు, మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) 2 వికెట్లు, ఆకాశ్ దీప్ (Akash Deep), నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)కి చెరో వికెట్ దక్కింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ జట్టుకు ఆరంభంలోని బిగ్ షాక్ తగిలింది.

ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashaswi Jaiswal) (4), శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) (1) మిచెల్ స్టార్క్ (Mitchell Starc) బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ (Virat Kohli మరోసారి నిరాశపరిచాడు. 16 బంతులాడిన విరాట్ కేవలం 3 పరుగులు చేసి హేజిల్‌వుడ్ (Hazlewood) బౌలింగ్‌లో పెవీలియన్ చేరాడు. ప్రస్తుతం టీమిండియా 3 కీలక వికెట్లు కోల్పోయి 22 పరుగు చేసింది. కేఎల్ రాహుల్ (KL Rahul) 24 బంతుల్లో 13 పరుగులు, రిషభ్ పంత్ (Rishabh Pant) పరుగులు ఏమి చేయకుండా క్రీజ్‌లో ఉన్నారు. ఆసిస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ (Mitchell Starc) 2 వికెట్లు, హేజిల్‌వుడ్ (Hazlewood) ఒక వికెట్ తీసుకున్నారు. వర్షం కారణంగా మరోసారి ఆటను అంపైర్లు నిలిపివేశారు.

Tags:    

Similar News