ICC Womens T20 World Cup: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన భారత బౌలర్లు

మహిళల టీ20 ప్రపంచ కప్ దుబాయ్ వేదికగా జరుగుతుంది. ఇందులో భాగంగా 7వ మ్యాచ్ పాకిస్తాన్, భారత్ జట్ల మధ్య జరుగుతుంది. మొదట టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

Update: 2024-10-06 11:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహిళల టీ20 ప్రపంచ కప్ దుబాయ్ వేదికగా జరుగుతుంది. ఇందులో భాగంగా 7వ మ్యాచ్ పాకిస్తాన్, భారత్ జట్ల మధ్య జరుగుతుంది. మొదట టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఫీల్డింగ్ చేసిన భారత బౌలర్లు పాకిస్తాన్ జట్టుకు బంతితో చుక్కలు చూపించారు. మొదటి ఓవర్ నుంచి పాకిస్తాన్ మహిళల జట్టుపై ఆదిపత్యాన్ని కనబరిచిన బౌలర్లు, కీలక ప్లేయర్లను వెంట వెంటనే అవుట్ చేశారు. దీంతో పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లిన పాకిస్తాన్ జట్టు డిఫెన్స్ లో పడింది. భారత బౌలర్ల ధాటికి ఆరుగురు ప్లేయర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి పాకిస్థాన్ జట్టు 8 వికెట్లు కోల్పోయి... కేవలం 105 పరుగులు మాత్రమే చేసింది. పాకిస్తాన్ బ్యాటర్లలో మునీబా అలి 17, నిదా దర్ 28, మినహా ఎవరూ సరిగ్గా రాణించలేదు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి 3, శ్రేయాంక పాటిల్ 2, శోభన, రేణుక ఠాకూర్, దీప్తి శర్మ లు ఒక్కో వికెట్ పడగొట్టారు. కాగా భారత జట్టుకు కీలక మైన ఈ మ్యాచులో గెలవాలంటే 120 బంతుల్లో 106 పరుగులు చేయాల్సి ఉంది.


Similar News