ఆర్సీబీలోకి రోహిత్?.. కీలక వ్యాఖ్యలు చేసిన ఏబీడీ

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై జట్టును వీడనున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.

Update: 2024-10-06 13:01 GMT

దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై జట్టును వీడనున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. వేలంలోకి వస్తాడని, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)లో చేరుతాడని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై సౌతాఫ్రికా, ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ తాజాగా తన యూట్యూబ్ చానెల్‌లో స్పందించాడు. ‘రోహిత్ ముంబై ఇండియన్స్‌ను వీడి ఆర్సీబీలో చేరితే అది చాలా పెద్ద కథ అవుతుంది. ఆ హెడ్‌లైన్‌ను ఊహించుకుంటేనే వావ్ అనిపిస్తుంది. అదే జరిగితే హార్దిక్ పాండ్యా ముంబైలో చేరడం కంటే ఇది చాలా పెద్దది. గుజరాత్ టైటాన్స్ నుంచి పాండ్యా తిరిగి ముంబైలో చేరాడు. అది నన్ను పెద్దగా ఆశ్చర్యపర్చలేదు. కానీ, రోహిత్ ముంబై నుంచి తన ప్రత్యర్థి అయిన ఆర్సీబీలో చేరితే అద్భుతమే. కానీ, అలా జరుగుతుందని అనుకోవడం లేదు. ముంబై ఇండియన్స్ రోహిత్‌ని విడిచిపెట్టే అవకాశం కనిపించడం లేదు. సున్నా లేదా 0.1 శాతం కూడా చాన్స్ లేదు.’ అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. కెప్టెన్‌గా రోహిత్ ముంబైని ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌కు ముందు ఫ్రాంచైజీ అనూహ్యంగా కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించి పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. అప్పటి నుంచి రోహిత్ జట్టును వీడతాడని వార్తలు వస్తున్నాయి. 

Tags:    

Similar News