ICC Under-19 World Cup 2024: కివీస్‌తో సమరానికి సిద్ధమైన టీమిండియా.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బ్లాక్ క్యాప్స్

ఐసీసీ అండర్-19 వరల్ల్ కప్‌లో భారత జట్టు విజయాల పరంపరను కొనసాగిస్తోంది.

Update: 2024-01-30 08:45 GMT
ICC Under-19 World Cup 2024: కివీస్‌తో సమరానికి సిద్ధమైన టీమిండియా.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బ్లాక్ క్యాప్స్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ అండర్-19 వరల్ల్ కప్‌లో భారత జట్టు విజయాల పరంపరను కొనసాగిస్తోంది. ఉదయ్ సహారన్ నేతృత్వంలో జ‌ట్టు గ్రూప్ దశలోని ఆడిన అన్ని మ్యాచ్‌లలో అప్రతిహత విజయాలతో జైత్రయాత్రను కొనసాగించి సూపర్ సిక్స్ దశకు చేరుకుంది. అయితే, సూపర్ సిక్స్ సమరంలో టీమిండియా నేడు పటిష్ట న్యూజిలాండ్ జట్టుతో తలపడబోతోంది. ఈ మ్యాచ్ మాంగాంగ్ ఓవల్‌లోని బ్లోమ్‌ ఫోంటెయిన్‌లో జరగనుంది. వరల్డ్ కప్ 2024లో ఒకవైపు భారత్ ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఫుల్ జోష్‌లో కీవిస్ జట్టుతో భారత్ అమీతుమీకి సిద్ధమైంది. మరోవైపు కివీస్ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు విజయాలతో జోరుమీద ఉంది. ఈ మేరకు టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 8 ఓవర్లు ముగిసేసరికి 47 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. 

Tags:    

Similar News