IPL 2025 : ఘనంగా మొదలైన ఐపీఎల్.. పుష్ప-2 సాంగ్ పాడిన శ్రేయా ఘోషల్.. కోహ్లీ, రింకు స్టెప్పులు

క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభమైంది.

Update: 2025-03-22 14:20 GMT
IPL 2025 : ఘనంగా మొదలైన ఐపీఎల్.. పుష్ప-2 సాంగ్ పాడిన శ్రేయా ఘోషల్..  కోహ్లీ, రింకు స్టెప్పులు
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ప్రారంభ వేడుకలతో లీగ్‌కు తెరలేసింది. ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, హాట్ బ్యూటీ దిశా పటానీ, ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్, మరో సింగర్ కరుణ్ ఔజ్లా సందడి చేశారు. ఓపెనింగ్ సెర్మనీకి షారుఖ్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించాడు. శ్రేయా ఘోషల్ తన గాత్రంతో ఫ్యాన్స్‌ను అలరించింది. పుష్ప-2 మూవీలోని ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ’ పాటను తెలుగులో పాడింది.

అలాగే, మా తుఝే సలామ్, వందేమాతరం సాంగ్స్ ఆలపించింది. అనంతరం హాటీ బ్యూటీ దిశా పఠానీ తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. పలు బాలీవుడ్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేయగా.. అభిమానుల కేకలతో స్టేడియం మొత్తం హోరెత్తింది. ఆ తర్వాత ర్యాపర్ కరుణ్ ఔజ్లా పాడిన ‘తోబా.. తోబా’ సాంగ్ ఫ్యాన్స్‌‌ను అలరించింది. అనంతరం షారుఖ్ ఖాన్.. స్టేజ్‌పైకి విరాట్ కోహ్లీ, రింకు సింగ్‌ను ఆహ్వానించాడు.


కోహ్లీ స్టేజ్‌పైకి రాగానే ఫ్యాన్స్ కోహ్లీ.. కోహ్లీ అంటూ అరిచారు. షారుఖ్‌తో కలిసి కోహ్లీ, రింకు స్టెప్పులు వేయడం ప్రారంభ వేడుకులకు మరింత జోష్ వచ్చింది. ఇక, చివరగా బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, సెక్రెటరీ దేవజిత్ సైకియా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్‌ స్టేజ్‌పైకి వచ్చారు. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడుతున్న విరాట్ కోహ్లీకి బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ మెమెంటో అందించారు. అనంతరం బీసీసీఐ అఫీషియల్స్ అందరూ కేక్ కట్ చేసి ఐపీఎల్‌‌ను ప్రారంభించారు. చివరగా జాతీయ గీతంతో ఓపెనింగ్ సెర్మనీ ముగిసింది. అనంతరం మ్యాచ్ ప్రారంభమవ్వగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచింది. ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది.


Tags:    

Similar News