Hardik Pandya : పాండ్యాకు మద్దతుగా నిలిచిన కైఫ్.. టీ20 కెప్టెన్సీపై కీలక వ్యాఖ్యలు
టీమ్ ఇండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ నియామకమైన విషయం తెలిసిందే.
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ నియామకమైన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యాకే పగ్గాలు దక్కుతాయని అందరూ భావించగా.. అనూహ్యంగా బీసీసీఐ సూర్యకు బాధ్యతలు అప్పగించింది. ఈ విషయంలో పాండ్యాకు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మద్దతుగా నిలిచాడు. సెలెక్షన్ కమిటీ పాండ్యా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అతనికే కెప్టెన్సీ ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు.
‘గుజరాత్ టైటాన్స్‌కు పాండ్యా రెండేళ్లు కెప్టెన్‌గా ఉన్నాడు. మొదటి సీజన్‌లోనే టైటిల్ అందించాడు. టీ20 జట్టును నడిపించిన అనుభవం కూడా ఉంది. టీ20 వరల్డ్ కప్‌లో అతను వైస్ కెప్టెన్ కూడా. కొత్త హెడ్ కోచ్ కొత్తగా ఆలోచించి ఉండొచ్చు. సూర్య కూడా మంచి ఆటగాడే. కెప్టెన్‌గా తన బాధ్యతలను చక్కగా నిర్వహిస్తాడని ఆశిస్తున్నా. కానీ, సెలెక్షన్ కమిటీ పాండ్యాకు మద్దతుగా ఉండాల్సింది. అతను కెప్టెన్సీకి అర్హుడు.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, పాండ్యా కెప్టెన్సీలో భారత జట్టు 16 టీ20లు ఆడగా.. అందులో 10 విజయాలు నమోదు చేసింది.