WTC Final‌: అతడు భారత జట్టులో ఉండాల్సింది : రికీ పాంటింగ్‌

లండన్‌ వేదికగా జూన్‌ 7 నుంచి జరగనున్న వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ఇప్పటికే రోహిత్ సేన ప్రాక్టీస్‌లో బీజీ బీజీగా ఉంది.

Update: 2023-05-30 13:50 GMT
WTC Final‌: అతడు భారత జట్టులో ఉండాల్సింది : రికీ పాంటింగ్‌
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: లండన్‌ వేదికగా జూన్‌ 7 నుంచి జరగనున్న వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ఇప్పటికే రోహిత్ సేన ప్రాక్టీస్‌లో బీజీ బీజీగా ఉంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌‌కు ముందు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. టీమ్ ఇండియా జట్టులో హార్దిక్ పాండ్యా ఉంటే బాగుండేదని రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.

అతడిని ఎంపికచేసి ఉంటే భారత జట్టు మరింత బలంగా ఉండేదన్నాడు. హార్దిక్‌ జట్టులో ఉంటే కచ్చితంగా ఎక్స్ ఫ్యాక్టర్ అయి ఉండేవాడని పాంటింగ్‌ పేర్కొన్నాడు. పాండ్యా గత కొంత కాలంగా కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌ మాత్రమే ఆడుతుండగా.. వెన్ను గాయం కారణంగా 2018 తర్వాత ఇప్పటి వరకూ హార్దిక్ పాండ్యా టెస్టు మ్యాచ్ ఆడలేదు.

Tags:    

Similar News