ప్రపంచ చెస్ ఛాంపియన్ టోర్నీకి ఎంపికైన గుకేష్

ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మన దేశానికి చెందిన గుకేష్ విజేతగా నిలిచాడు.

Update: 2024-04-22 03:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మన దేశానికి చెందిన గుకేష్ విజేతగా నిలిచాడు. సంచలన ప్రదర్శనతో 17 ఏళ్ల గుకేష్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. దీంతో ప్రపంచ ఛాంపియన్ టైటిల్ పోరుకు అర్హత సాధించిన పిన్న వయస్కుడిగా గుకేష్ నిలిచాడు. క్యాండిడేట్స్ టోర్నీలో 14 పాయింట్లకు 9 పాయింట్లను గుకేష్ సాధించాడు. చివరి రౌండ్‌లో అమెరికన్ హికారి నకమురాతో గుకేష్ గేమ్ డ్రా చేసుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్యాండిడేట్స్ టోర్నీ దక్కించుకున్న రెండో భారతీయుడిగా గుకేష్ రికార్డులకెక్కాడు. ఇక, ఫిడే క్యాండిడేడ్స్ చెస్ టోర్నీలో ప్రతిభ చాటిన గుకేష్ ఈ ఏడాది ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ పోరులో తలపడనున్నాడు. చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ తో గుకేష్ ప్రపంచ ఛాంపియన్ టైటిల్ పోరులో తలపడనున్నారు.

Tags:    

Similar News