Hardik Pandya : గూగుల్ సెర్చ్.. టాప్ 10 జాబితాలో హార్ధిక్ పాండ్యా
2024 ఏడాది ముగియనుండటంతో గూగుల్ ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన ఆటగాళ్ల జాబితాను మంగళవారం విడుదల చేసింది.

దిశ, స్పోర్ట్స్ : 2024 ఏడాది ముగియనుండటంతో గూగుల్ ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన ఆటగాళ్ల జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఇందులో టాప్ 10లో భారత్ క్రికెటర్ హార్ధిక్ పాండ్యా చోటు దక్కించుకున్నాడు. ఫస్ట్ ప్లేస్‌లో అల్జీరియన్ బాక్సర్ ఇమానే ఖలీఫ్ నిలిచారు. సెకండ్ ప్లేస్‌లో మైక్ టైసన్, థర్డ్ ప్లేస్‌లో స్పానిష్ ఫుట్‌బాల్ సంచలనం లమినే యమాల్ నిలిచారు. హార్ధిక్ పాండ్యా లిస్టులో 7వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ముంబాయి ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్‌గా తప్పించి హార్ధిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇవ్వడంతో ఈ ఆటగాడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఓవర్ వేసి భారత్‌కు చిరస్మణీయ విజయం అందించడంతో హార్ధిక్ పాండ్యా ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. భారత్‌కే చెందిన క్రికెటర్ శశాంక్ సింగ్ సైతం లిస్టులో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ ఆటగాడిని పంజాబ్ అనుకోకుండా కొనుగోలు చేయగా తనను తాను నిరూపించుకుని కీలక ఆటగాడిగా ఎదిగాడు.