ఉపాధి హామీ కూలీగా షమీ సోదరి!
ఈ పథకంలో కూలీలుగా వీరిద్దరే నమోదు చేసుకున్నారా? లేదంటే వీరి పేర్ల మీద వేరెవరైనా నమోదు చేసుకొని డబ్బులు తీసుకుంటున్నారా అనే విషయంపై స్పష్టత రాలేదు.

- లబ్దిదారుల జాబితాలో పేరు
- కూలీ డబ్బులు తీసుకున్నట్లు రిజిస్టర్‌లో నమోదు
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా పేసర్, ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో సభ్యుడిగా ఉన్న మహ్మద్ షమీ సోదరి కుటుంబంపై పలు ఆరోపణలు వస్తున్నాయి. షమీ సోదరి పేరు ఉపాధి హామీ పథకం లబ్దిదారుల లిస్టులో ఉన్నట్లు జాతీయ మీడియా కథనం ప్రచురించింది. షమీ సోదరి షబీమాతో పాటు ఆమె భర్త కూలీ డబ్బులు తీసుకున్నట్లు తెలిసింది. షబీమా, ఆమె భర్త జాతీయ ఉపాధి హామీ కార్మికులుగా నమోదు చేసుకున్నారని.. 2021 నుంచి 2024 వరకు వారు ఆ పథకం కింది వచ్చిన డబ్బులను తీసుకున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన పత్రాలు కూడా ఉన్నట్లు మీడియా నివేదికలో స్పష్టమైంది. అయితే ఈ కథనంపై షమీ లేదా అతని కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
మరోవైపు ఈ పథకంలో కూలీలుగా వీరిద్దరే నమోదు చేసుకున్నారా? లేదంటే వీరి పేర్ల మీద వేరెవరైనా నమోదు చేసుకొని డబ్బులు తీసుకుంటున్నారా అనే విషయంపై స్పష్టత రాలేదు. వారి పేరు మీద ఎవరైనా మోసం చేసి ఉండొచ్చుననే అనుమానాలు కూడా ఉన్నాయి. కాగా, ఇటీవల దుబాయ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మహ్మద్ షమీ తల్లి, అతని సోదరి కనపడ్డారు. షమీ తల్లి పాదాలకు విరాట్ కోహ్లీ నమస్కరించిన వీడియోలు కూడా వైరల్‌గా మారాయి. కాగా, ప్రస్తుతం ఈ వివాదంపై యూపీ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తోంది.