జింబాబ్వే స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం..

జింబాబ్వే స్టార్ క్రికెటర్ గ్యారీ బ్యాలెన్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Update: 2023-04-20 16:06 GMT

హరారే: జింబాబ్వే స్టార్ క్రికెటర్ గ్యారీ బ్యాలెన్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్టు బ్యాలెన్స్ వెల్లడించాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. జింబాబ్వేకు చెందిన గ్యారీ బ్యాలెన్స్ 2013లో ఇంగ్లాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి 2017 వరకు ఇంగ్లాండ్ తరఫున ఆడాడు.

ఆ తర్వాత అతను ఇంగ్లాండ్ జట్టులో చోటు కోల్పోవడంతో.. గతేడాది డిసెంబర్‌లో సొంత దేశం తరఫున ఆడేందుకు జింబాబ్వే క్రికెట్ బోర్డుతో రెండేళ్ల ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో జింబాబ్వే తరఫున అరంగేట్రంలోనే సెంచరీ చేశాడు. జింబాబ్వే జట్టులో చేరిన నాలుగు నెలలకే బ్యాలెన్స్ అనూహ్యంగా ఆటకు వీడ్కోలు పలకడం గమనార్హం. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 44 టెస్టుల, 21 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌లు ఆడిన అతను.. 2, 137 పరుగులు చేశాడు.

Tags:    

Similar News