పారిస్ ఒలింపిక్స్‌లో ఫ్లాగ్ బేరర్‌గా సింధు

పారిస్ ఒలింపిక్స్‌‌ ఓపెనింగ్ సెర్మనీలో భారత బృందాన్ని స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు నడిపించనుంది.

Update: 2024-07-08 17:16 GMT

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌‌ ఓపెనింగ్ సెర్మనీలో భారత బృందాన్ని స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు నడిపించనుంది. ఈ విషయాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) సోమవారం తెలిపింది. ఇప్పటికే టేబుల్ టెన్నిస్ స్టార్ ఆటగాడు శరత్ కమల్‌ను ఫ్లాగ్ బేరర్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఓపెనింగ్ సెర్మనీలో శరత్‌తోపాటు సింధు కూడా పతాకధారిగా వ్యవహరించనుంది. రియో ఒలింపిక్స్‌లో రజతం, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధు.. పారిస్ విశ్వక్రీడల్లో స్వర్ణం సాధించాలనే పట్టుదలతో ఉన్నది.

మరోవైపు, లండన్ ఒలింపిక్స్‌-2012 మెడలిస్ట్, షూటర్ గగన్ నారంగ్‌‌ను ఐవోఏ పారిస్ క్రీడలకు వెళ్లే భారత బృందానికి చెఫ్ దే మిషన్‌గా నియమించింది. ఇప్పటికే ఆ బాధ్యతలను దిగ్గజ బాక్సర్ మేరీకోమ్‌కు అప్పగించగా.. ఏప్రిల్‌లో వ్యక్తిగత కారణాలతో తప్పుకుంది. ఈ నేపథ్యంలో మేరీ కోమ్ స్థానంలో నారంగ్‌ను నియమించినట్టు ఐవోఏ ప్రెసిడెంట్ పీటీ ఉష తెలిపారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారని ఆమె దీమా వ్యక్తం చేసింది. 


Similar News