'వారినే గుర్తు పెట్టుకుంటారు'.. భారత యువ ఆటగాళ్లపై విండీస్‌ మాజీ కెప్టెన్ ఆసక్తికర కామెంట్స్

ఐసీసీ ట్రోఫీ కోసం భారత్ పదేళ్ల నుంచి నిరీక్షిస్తోంది.

Update: 2023-08-11 12:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ ట్రోఫీ కోసం భారత్ పదేళ్ల నుంచి నిరీక్షిస్తోంది. నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ కీలక సమయంలో విఫలం కావడంతో విజేతగా నిలవలేపోతోంది. ఈ క్రమంలో భారత యువ ఆటగాళ్లను ఉద్దేశించి విండీస్‌ మాజీ కెప్టెన్ డారెన్ సామీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘యశస్వి జైస్వాల్, హార్దిక్‌ పాండ్య, తిలక్ వర్మ, శుభ్‌మన్‌ గిల్.. ఇలా టాలెంటెడ్‌ ఆటగాళ్లను భారత్‌ తయారు చేయగలుగుతోంది. కానీ, ఎవరైతే ఐసీసీ ట్రోఫీని అందించగలుగుతారో వారినే అభిమానులు గుర్తు పెట్టుకుంటారు. దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టి జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్ తొలి టెస్టులోనే భారీ సెంచరీ సాధించాడు. ఇదంతా డొమిస్టిక్‌ క్రికెట్‌ ప్రమాణాలను తెలియజేస్తోంది. అక్కడ బాగా ఆడితే జాతీయ జట్టులోకి వచ్చేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి’’ అని సామీ వెల్లడించాడు.


Similar News