ICC World Cup 2023: అతడికి కలిసి రావొచ్చు.. బీసీసీఐ మాజీ చీఫ్ ఆసక్తకిర కామెంట్స్

టీమ్‌ ఇండియా యువ ఆటగాడు తిలక్‌ వర్మ వెస్టిండీస్‌ పర్యటనలో అదరొట్టేస్తున్నాడు.

Update: 2023-08-11 12:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమ్‌ ఇండియా యువ ఆటగాడు తిలక్‌ వర్మ వెస్టిండీస్‌ పర్యటనలో అదరొట్టేస్తున్నాడు. టీ20ల్లో అరంగేట్రం చేసిన వర్మ ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచుల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. దీంతో వచ్చే ప్రపంచకప్‌లో అతడికి మిడిలార్డర్‌లో చోటు ఇవ్వాలనే డిమాండ్లూ వస్తున్నాయి. ఎడమ చేతివాటం కలిగిన తిలక్‌ దూకుడుగా ఆడటంలో రాటుదేలుతున్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ చీఫ్‌ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్‌ స్క్వాడ్‌లోకి వచ్చే అవకాశాలు తిలక్‌ వర్మకు ఉన్నట్లు పేర్కొన్నాడు.

''మిడిలార్డర్‌లో ఆడే శ్రేయస్‌ అయ్యర్ ఫిట్‌గా ఉన్నాడా..? లేదా అనేది తెలియదు. ఒకవేళ అతడు ఫిట్‌గా లేకుండా వరల్డ్‌ కప్‌ నుంచి వైదొలిగితే ఆ స్థానం కోసం సరైన వ్యక్తిగా తిలక్‌ వర్మను పరిగణనలోకి తీసుకొనేందుకు అవకాశం ఉంది. తిలక్ వర్మకి ఫాస్ట్‌, స్పిన్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోగలిగే సత్తా ఉంది. పరిస్థితులకు తగ్గట్టుగా ఇన్నింగ్స్‌లో వేగం తీసుకురాగలడు. టాప్‌ - 4లో ఎడమ చేతివాటం బ్యాటర్‌ లేకపోవడం కూడా అతడికి కలిసి రావొచ్చు. స్ట్రైక్‌ను రొటేట్‌ చేస్తూ.. ఆసీస్‌ దిగ్గజం మైకెల్‌ బెవాన్‌లా కీలక ఇన్నింగ్స్‌లు ఆడగలడని భావిస్తున్నా'' అని ప్రసాద్‌ తెలిపాడు.


Similar News