ఫుట్‌బాల్ దిగ్గజ ప్లేయర్ పీలే కన్నుమూత
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజ ప్లేయర్ పీలే తుదిశ్వాస విడిచాడు.
దిశ, వెబ్‌డెస్క్: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజ ప్లేయర్ పీలే తుదిశ్వాస విడిచాడు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ సావోపాలోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రిలో మృతి చెందాడు. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మరణంతో ఫుట్ అభిమానులను నిరాశకు గురిచేసింది. 1958లో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ ప్లేయర్.. మూడు ప్రపంచ కప్‌లను గెలుచుకున్నాడు. అంతేకాక నాలుగు ప్రపంచకప్‌లలో దేశానికి ప్రాతినిధ్యం వహించిన పీలే.. 1958, 1962, 1970లలో ప్రపంచకప్‌లు అందుకున్నాడు. పీలే బ్రెజిల్ తరఫున 92 మ్యాచ్‌లలో 77 గోల్స్ చేశాడు. ఇక, ఓవరాల్‌గా తన కెరీర్‌లో 1366 మ్యాచ్‌ల్లో 1281 గోల్స్ చేశాడు.