''ముందు మీ గడ్డపై సిరీస్‌లను గెలవండి''.. అంటూ.. పాక్ అభిమానికి టీమిండియా మాజీ క్రికెటర్ కౌంటర్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో కూడా భారత్ జోరు మీద ఉంది.

Update: 2023-02-10 10:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో కూడా భారత్ జోరు మీద ఉంది. నిన్న ప్రారంభమైన ఈ టెస్టులో తొలి రోజున ఆస్ట్రేలియా జట్టును కేవలం 177 పరుగులకే ఇండియా కట్టడి చేసింది. ఆ తర్వాత నిన్న తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 77 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 171 బంతుల్లో సెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

ఇండియాను ఇండియాలో ఓడించే ఉత్తమ అవకాశం తడిగా ఉన్న తారాజువ్వలా మారితే ఎలా ఉంటుందని ఆయన ట్వీట్ చేయగా.. ఈ ట్వీట్‌పై పాకిస్థాన్‌కు చెందిన తల్లా హెజాజ్ అనే అభిమాని స్పందిస్తూ.. ''భారత్‌ను భారత్‌లో ఓడించే సత్తా కేవలం పాకిస్థాన్‌కు మాత్రమే ఉంది'' అని చెప్పారు. దీనికి సమాధానంగా ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. మీ ఆశాభావాన్ని ఇష్టపడుతున్నానని.. అయితే, ''ముందు మీ గడ్డపై సిరీస్‌లను గెలవండి'' అంటూ చురక అంటించాడు.

Tags:    

Similar News