2023 World Cup schedule: వరల్డ్ కప్ షెడ్యూల్‌లో మార్పులు.. బీసీసీఐ సెక్రెటరీ కీలక ప్రకటన

బీసీసీఐ సెక్రెటరీ జై షా వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ గురించి కీలక ప్రకటన చేశారు.

Update: 2023-07-28 11:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీసీసీఐ సెక్రెటరీ జై షా వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ గురించి కీలక ప్రకటన చేశారు. మ్యాచ్‌లు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జరగడం లేదని, కొన్ని మ్యాచ్‌లు తేదీలలో మార్పులు ఉంటాయని బీసీసీఐ సెక్రెటరీ జై షా ప్రకటించారు. కాగా పూర్తి తేదీలతో కూడిన కొత్త షెడ్యూల్‌ను రెండు మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. ఈ షెడ్యూల్ విడుదల అయ్యాక టికెట్స్‌ను కొనుగోలు చేయడానికి అవకాశాలు కల్పిస్తామని జై షా చెప్పారు. అంతే కాకుండా ఇండియా తరఫున వరల్డ్ కప్‌లో బరిలోకి దిగడానికి సూపర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు.


Similar News