80 మీటర్ల రివర్స్ సిక్సర్.. సూర్యకుమార్ యాదవ్‌ను తలపించిన జో రూట్ (వీడియో)

గుజరాత్‌‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ మధ్య మొదటి వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది.

Update: 2023-10-05 12:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ మధ్య మొదటి వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఫేసన్ ట్రెంట్ బౌల్ట్ వేసిన 11.3 వ బంతికి రూట్ రివర్స్ షాట్ ఆడాడు. దీంతో ఆ బంతి 80 మీటర్ల సిక్స్ పడింది. కాగా ఆ బంతిని రూట్ ఆడిన విధానం భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ను తలపించింది.

2023 ఐపీఎల్ ఇంటా రివర్స్ బ్యాక్ షాట్లకు సూర్య పెట్టింది పేరుగా మారిన విషయం తెలిసిందే. వికెట్ల ముందల గజిబిజిగా కదులుతూ బౌలర్‌ను ఇబ్బంది పెట్టి ఈ షాట్స్ సూర్య కొడతాడు. కాగా అదే తరహాలో జో రూట్ కొట్టిన బ్యాక్ రివర్స్ షాట్ 80 మీటర్ల సిక్సర్ పడింది. కాగా దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో భారత అభిమానులు రూట్ సూర్యను బాగా ఫాలో అయ్యడు గురూ.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News