ఈ వీడియోలు ఫేక్.. సచిన్ డీప్ ఫేక్ వీడియో వైరల్

మరో డీప్ ఫేక్ వీడియో కలకలం రేపుతోంది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఈ మార్ఫింగ్ వీడియో బారిన పడ్డారు. ఈ వీడియో నకిలీదంటూ సచిన్ తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

Update: 2024-01-15 10:04 GMT

దిశ, స్పోర్ట్స్: మరో డీప్ ఫేక్ వీడియో కలకలం రేపుతోంది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఈ మార్ఫింగ్ వీడియో బారిన పడ్డారు. ఈ వీడియో నకిలీదంటూ సచిన్ తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్ గేమింగ్ యాప్ కోసం సచిన్ పబ్లిసిటీ చేస్తున్నట్లు వీడియోలో ఉంది. ఈ యాప్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించవచ్చో చెప్తున్న వీడియోపై సచిన్ టెండుల్కర్ స్పందించారు. ఈ వీడియోలు నకిలీవని.. టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం దారుణమన్నారు. ఇలాంటి వీడియోలు, ప్రకటనలు, యాప్ లు ఎక్కడ కన్పించినా ఫిర్యాదు చేయాలని సూచించారు. డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలు తీసుకోవడం అత్యవసరం అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు సచిన్ టెండూల్కర్. ఈ పోస్ట్ ను కేంద్ర ఐటీశాఖ మంత్రి, మహారాష్ట్ర సైబర్ సెల్ ట్విట్టర్ అకౌంట్ కు ట్యాగ్ చేశారు.


Similar News