ఆస్ట్రేలియా ఇలా అవుతుందని నేను ఊహించలేదు: రోహిత్ శర్మ

భారత్, ఆస్ట్రేలియా మధ్య నాగ్ పూర్ వేదికగా జరిగిన అత్యంత ప్రతిష్టాత్మక మొదటి టెస్ట్ మ్యాచ్ భారత్.. 132 పరుగుల తేడాతో గెలిచింది.

Update: 2023-02-12 02:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఆస్ట్రేలియా మధ్య నాగ్ పూర్ వేదికగా జరిగిన అత్యంత ప్రతిష్టాత్మక మొదటి టెస్ట్ మ్యాచ్ భారత్.. 132 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. భారత టీం.. కష్టతరమైన రోజుల బౌలింగ్‌కు సిద్ధంగా ఉన్నాము, సెషన్ తర్వాత సెషన్‌లను గడిపాము. మా బౌలర్లు ఇంత బాగా బౌలింగ్ చేస్తారని ఊహించలేదు. " 3వ రోజు రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా మొత్తం 10 వికెట్లను భారత్ చేజార్చుకుంది.

దీంతో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. అయితే ఆస్ట్రేలియా జట్టు.. ఇలా ఒక సెషన్ లోనే ఆలౌట్ అవుతుందని అస్సలు ఊహించలేదు అని రోహిత్ శర్మ అన్నారు. కాగా ఈ ఓటమితో ఆస్ట్రేలియా జట్టు తమ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత తక్కువ స్కోర్ కు అవుట్ ఆలౌట్ అయి.. చెత్త రికార్డు ను తమ పేరు మీద సృష్టించుకున్నారు. కాగా భారత్‌కు ఇది సొంత గడ్డపై తిరుగులేని గెలుపుగా క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags:    

Similar News