Shikhar Dhawan: 'దాంట్లో నా పేరు లేకపోవడంతో షాక్‌కు గురయ్యా'

చాలా కాలంపాటు రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన శిఖర్‌ ధావన్‌.. ఫామ్‌లేక జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.

Update: 2023-08-10 17:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: చాలా కాలంపాటు రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన శిఖర్‌ ధావన్‌.. ఫామ్‌లేక జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. త్వరలో జరిగే ఆసియా క్రీడలకు అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినా సెలక్టర్లు మొండిచేయి చూపారు. అతడు భారత్‌ తరఫున చివరగా 2022 డిసెంబరులో వన్డే మ్యాచ్‌ ఆడాగా.. ఆ తర్వాత టీమ్‌ఇండియాకు ఎంపిక కాలేదు. సెప్టెంబరు 23 నుంచి చైనాలోని హాంగ్‌జౌలో ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నీలో టీమ్‌ ఇండియా తొలిసారిగా బరిలోకి దిగనుంది.

సీనియర్‌ జట్టు వన్డే ప్రపంచకప్‌ కోసం సిద్ధమవుతుండటంతో  రెండో జట్టుని పంపుతున్నారు. రుతురాజ్‌ గైక్వాడ్‌‌ను కెప్టెన్‌గా నియమించి యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేశారు. తొలుత ఈ టోర్నీకి శిఖర్‌ ధావన్‌ కెప్టెన్సీలో జట్టు పంపుతారని ప్రచారం జరిగింది. కానీ, సెలక్టర్లు ధావన్‌కు మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో ఆసియా క్రీడలకు ఎంపిక కాకపోవడంపై ధావన్ తొలిసారి స్పందించాడు. జట్టులో తన పేరు లేకపోవడంతో కొంచెం షాక్‌కు గురయ్యానని చెప్పాడు. అవకాశం వస్తే తిరిగి జాతీయ జట్టులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంటానని పేర్కొన్నాడు.


Similar News