Virat Kohli ,Rohit Sharma వల్ల అతడికి సరైన గుర్తింపు దక్కలేదు: రవిశాస్త్రి హాట్ కామెంట్స్
టీమిండియా స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్‌పై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు.
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్‌పై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. శిఖర్ ధావన్ చాలా టాలెంటెడ్ ప్లేయరని.. ఎన్నో సార్లు ఈ విషయాన్ని నిరూపించాడని రవిశాస్త్రి పేర్కొన్నారు. శిఖర్ ఎంతో అద్భుతమైన ఆటగాడు అయినప్పటికీ.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలపైనే ఎక్కువ దృష్టి ఉండటంతో అతడికి సరైన గుర్తింపు దక్కలేదని అభిప్రాయపడ్డాడు. ఒకసారి ధావన్ వన్డే రికార్డును పరిశీలిస్తే.. అతడు ఎలాంటి ఆటగాడో తెలుస్తుందన్నారు. టీమిండియాలో ఎంతో మంది యువ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. ధావన్ అనుభవానికి విలువ ఉంటుందని తాను భావిస్తున్నానని చెప్పారు.
ఇక, న్యూజిలాండ్‌లో జరుగుతోన్న వన్డే సిరీస్‌కు సీనియర్ ప్లేయర్ కోహ్లీ, టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ విశ్రాంతినివ్వడంతో.. టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్ వ్యవహరిస్తున్నాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 306 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ.. అతిథ్య న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన శిఖర్ ధావన్.. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.